ఉన్నత లక్ష్యాలతో బంగారు భవిష్యత్తు
● కలెక్టర్ శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా శ్రమిస్తే భవిష్యత్తు బంగారు మయమవుతుందని విద్యార్థులకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ సూచించారు. శుక్రవారం రాత్రి కొత్తచెరువులోని బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహం పరిసరాలు, వంట గది, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం సౌకర్యాలపై విద్యార్థులతో ఆరా తీశారు. చేపట్టాల్సిన మార్పులపై వార్డెన్‌కు పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. అనంతరం పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థుల నుంచి రాబట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్‌ను పొదుపుగా
వాడుకుందాం : డీఆర్‌ఎం
గుంతకల్లు: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రైల్వే క్లబ్‌లో విద్యుత్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఆర్‌ఎంతోపాటు ఏడీఆర్‌ఎం సుధాకర్, గతి శక్తి సీపీఎం రామకృష్ణా, సీనియర్ డీఈఈ శ్రీనిబాష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ విద్యుత్ పొదపులో గుంతకల్లు రైల్వే డివిజన్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంతకల్లులోని డీటీటీసీ కేంద్రంతోపాటు హాస్టల్‌కు బిల్డింగ్‌కు ఫస్ట్ ప్రైజ్‌ను రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకోగా, డివిజన్‌లోని రాయచూర్ రైల్వేస్టేషన్ మెరిట్ సర్టిఫికేట్‌ను కేంద్ర మంత్రి చేతులుగా అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా పలువురి ఉద్యోగులకు ప్రోతాహ్సంల్లో భాగంగా సరిఫికెట్స్‌తోపాటు బహుమతులు అందించారు.


