ప్రోత్సాహం కరువు | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహం కరువు

Dec 20 2025 9:16 AM | Updated on Dec 20 2025 9:16 AM

ప్రోత

ప్రోత్సాహం కరువు

మడకశిర: పట్టు రైతుపై చంద్రబాబు సర్కార్‌ కరుణ చూపడం లేదు. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించకుండా వేధిస్తోంది. బకాయిలు రూ.కోట్లలో చేరినా ఆ ఊసే ఎత్తడం లేదు. పట్టు రైతులకు అందించే సబ్సిడీల్లో కేంద్రం తన వాటా మొత్తం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా మొత్తం చెల్లించకుండా మొండిచేయి చూపుతోంది. బకాయిలన్నీ పూర్తి స్థాయిలో విడుదల చేసి ఆదుకోవాలని పట్టు రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.

కేంద్రం ఇచ్చే సబ్సిడీనే అధికం..

పట్టు రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు ద్వారా చేయూత ఇస్తోంది. పట్టు రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో షెడ్లు, ప్లాంటేషన్‌, షూట్‌ రేరింగ్‌ తదితర వాటిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ క్రమంలో ఓసీ, బీసీ రైతులకు 50 శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తుండగా...రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 శాతం మాత్రమే సబ్సిడీ అందిస్తోంది. మిగిలిన 25 శాతం రైతులు తమ వాటాగా భరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు కేంద్రం 65 శాతం సబ్సిడీ అందిస్తుండగా...రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం మాత్రమే ఇస్తోంది. మిగిలిన 10 శాతం వాటాను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అరకొర సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బకాయిలు బండగా మారాయి.

బకాయి బండ..

రాష్ట్రంలోని పట్టు రైతులకు ప్రభుత్వం రూ.90 కోట్ల వరకు బకాయి పడింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించినా.... రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రేషం షెడ్లు, ప్లాంటేషన్‌, షూట్‌ రేరింగ్‌ తదితర వాటి కోసం కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో పట్టు రైతులు ఆందోళనకు సిద్ధం కాగా, ఇటీవలే సబ్సిడీ రూపంలో అందించాల్సిన రూ.14 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే బైవోల్టిన్‌ రైతులకు కేజీకి రూ.50 చొప్పున చెల్లించాల్సిన రూ.76 కోట్ల ప్రోత్సాహకాన్ని మాత్రం విడుదల చేయలేదు.

పట్టు రైతును పట్టించుకోని

చంద్రబాబు సర్కార్‌

బైవోల్టిన్‌ రైతుల ప్రోత్సాహకం బకాయి రూ.76 కోట్లపైనే

విడతల వారీగా ఇవ్వాలని

విన్నవించినా.. పట్టించుకోని వైనం

ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న

పట్టురైతులు

పట్టు రైతులకు చంద్రబాబు సర్కార్‌ శఠగోపం పెట్టేందుకు సిద్ధమైంది. బైవోల్టిన్‌ పండించే పట్టు రైతులకు ప్రోత్సాహం కింద కేజీకి రూ.50 చొప్పున ఇవ్వాల్సిన మొత్తం రూ.76 కోట్లకు చేరినా.. దాని గురించే పట్టించుకోవడం లేదు. రైతులు ఎన్నిసార్లు విన్నవించినా కనీస స్పందన లేకపోవడంతో రైతులు చంద్రబాబు తీరుపై పెదవి విరుస్తున్నారు.

ప్రోత్సాహం కరువు 1
1/1

ప్రోత్సాహం కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement