
ఆర్డీఓపై చర్యలు తీసుకోండి
ప్రశాంతి నిలయం: ‘ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల నుంచి ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ధర్మవరం ఆర్డీఓ అక్రమార్కులతో కుమ్మక్కు అయ్యారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీనిపై తక్షణమే విచారణ జరిపి ఆర్డీఓతో పాటు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్‌తో కలసి వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకు ప్రతి నెలా ఇసుక మాఫియా నుంచి రూ.10 లక్షల మామూళ్లు ముడుతున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. లోకాయుక్త, చీఫ్ సెక్రెటరీ, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితరులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ సాకే శివ, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు అమీర్‌బాషా, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎం.చౌడప్ప, గోపాల్ తదితరలు పాల్గొన్నారు.