
ఇంటి పట్టాలు ఇవ్వకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
ప్రశాంతి నిలయం: జిల్లాలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకుంటే రాబోవు రోజుల్లో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలంటూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో రాంభూపాల్ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేష్, నాయకులు నరసింహులు, లక్ష్మీనారాయణ, దిల్షాద్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, రామకృష్ణ, శ్రీనివాసులు, హరి, పెద్దన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
రాంభూపాల్