క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు | - | Sakshi
Sakshi News home page

క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు

Mar 19 2025 1:50 AM | Updated on Mar 19 2025 1:48 AM

హిందూపురం అర్బన్‌: ఎండుమిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 93 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్‌ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.7,200 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.

ఎకై ్సజ్‌ శాఖలో

పదోన్నతులు

కర్నూలు: ఎకై ్సజ్‌ శాఖలో పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ఫోర్త్‌జోన్‌ పరిధిలో మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉండగా 48 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్‌హాక్‌ పద్ధతిలో ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డైరెక్టర్‌ నుంచి ఇటీవల జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రూప్‌–2 పోస్టులే అయినా అడ్‌హాక్‌ పద్ధతిలో పదోన్నతికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే సర్వీస్‌ రిజిస్టర్ల పరిశీలన పూర్తి కావడంతో ఈ నెల 20, 21 తేదీల్లో క్లర్కులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులకు డిప్యూటీ కమిషనర్‌ లేఖ రాశారు. సీమ జిల్లాల్లో 12 మంది క్లర్కులు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందేందుకు జాబితా సిద్ధమైంది. వైద్యపరీక్షల అనంతరం పదోన్నతి కల్పించి ఈ నెలాఖరులోగా పోస్టింగులు కేటాయించే అవకాశమున్నట్లు ఎకై ్సజ్‌ అధికారులు చెబుతున్నారు.

జెడ్పీలో పదోన్నతులకు సన్నాహాలు

అనంతపురం సిటీ: జిల్లా పరిషత్‌ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జెడ్పీలోని ప్రత్యేక బృందం సీనియారిటీ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. జిల్లా పరిషత్‌ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్‌ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తొలుత సీనియారిటీ, రోస్టర్‌ ప్రకారం ముసాయిదా జాబితా తయారు చేసి సీఈఓ పరిశీలన అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేవనిపిస్తే.. తుది జాబితాను సిద్ధం చేసి చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ ఆమోదంతో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తారు.

క్వింటా ఎండుమిర్చి  రూ.15 వేలు 1
1/2

క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు

క్వింటా ఎండుమిర్చి  రూ.15 వేలు 2
2/2

క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement