మొత్తం మండలాలు | - | Sakshi
Sakshi News home page

మొత్తం మండలాలు

Mar 19 2025 1:50 AM | Updated on Mar 19 2025 1:48 AM

రెవెన్యూ గ్రామాలు
తొలుత విస్తీర్ణం
ప్రస్తుత విస్తీర్ణం

పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా) చైర్మన్‌ పదవి హాట్‌ టాపిక్‌గా మారింది. పదవి కోసం కూటమి పార్టీల నేతలు పోటాపోటీగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలైతే ఏకంగా అమరావతిలోనే మకాం వేసి లోకేష్‌ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రంగంలోకి దిగారు. ప్రొటోకాల్‌ సమస్య తీరడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు పుడా చైర్మన్‌ గిరీ కోసం ప్రయత్నిస్తున్నారు.

పుడా

పరిధి

ఇలా...

సాక్షి, పుట్టపర్తి

పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా)పై ఇప్పుడు అందరి కళ్లూ పడ్డాయి. దాదాపు ఆరు మండలాలు విస్తరించి ఉన్న ‘పుడా’ పీఠం దక్కితే దాదాపు పుట్టపర్తి నియోజకవర్గమంతా చేతిలో ఉన్నట్లే. ప్రొటోకాల్‌తో పాటు కీలకమైన నిర్ణయాల్లోనూ ‘పుడా’ చైర్మన్‌ పాత్ర తప్పకుండా ఉంటుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో చైర్మన్‌గా ఉన్న లక్ష్మీనరసమ్మ.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఆ నామినేటెడ్‌ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో కూటమి నేతలందరి గురి ‘పుడా’ గిరిపై పడింది.

రేసులో మాజీ మంత్రి

కూటమి ప్రభుత్వం విడతల వారీగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా) చైర్మన్‌పై స్పష్టత ఇవ్వలేదు. పుట్టపర్తి నుంచి ఒకప్పుడు మంత్రిగా పని చేసిన సీనియర్‌ నేత ‘పుడా’ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారని తెలిసింది. అధికార దాహంతో నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు చేస్తూ విమర్శల పాలవుతోన్న ఆయన ‘పుడా’ చైర్మన్‌ పదవి వస్తే.. ప్రొటోకాల్‌ పంచాయితీ ఉండదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికో ఇవ్వడం ఎందుకు? తానే ‘పుడా’చైర్మన్‌ పదవి తీసుకుంటే తప్పేంటని సన్నిహితులతో చర్చించారని సమాచారం. ఈ క్రమంలోనే ఎవరికీ ఇవ్వకుండా.. జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా..‘పుడా’ చైర్మన్‌గా ఎవరినీ ప్రకటించకపోవడంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది.

అమరావతిలో ఆశావహుల మకాం

వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీ కేటగిరీకి చెందిన మహిళకు పుడా చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి బీసీ కులాలకే ఇస్తారన్న ఆలోచనతో ఆశావహులు జోరు మీద ఉన్నారు. కొందరు యువ నేతలూ తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఆశావహులు ఎవరికి వారుగా.. అమరావతిలో మకాం వేస్తున్నారు. నెలలో మూడు – నాలుగుసార్లు వెళ్లి నారా లోకేశ్‌తో లాబీయింగ్‌ చేస్తున్నారని తెలిసింది. అయితే స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రమేయం లేకుండా ‘పుడా’చైర్మన్‌ గిరీ ఎవరికీ దక్కదన్న విషయం తెలిసినా.. దీనిపై ఆమె ఇంతవరకు నోరు విప్పకపోవడంతో కుటుంబ సభ్యులకే ఇస్తారేమో అనే చర్చ జరుగుతోంది.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే భారీ వృద్ధి

నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా) పరిధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విస్తరించింది. 1992లో ఏర్పడిన ‘పుడా’ఆరు గ్రామాలకే పరిమితం కాగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మండలాలకు విస్తరించింది. ఫలితంగా ‘పుడా’పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తం 82 రెవెన్యూ గ్రామాలు ‘పుడా’పరిధిలో ఉన్నాయి.

ప్రస్థానం ఇలా..

1992 ఫిబ్రవరి 18వ తేదీన పుడా (పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పడింది. పుట్టపర్తి, కప్పలబండ, బ్రాహ్మణపల్లి, లోచెర్ల, బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాలు ‘పుడా’పరిధిలో ఉండేవి. మొత్తం 86.54 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉండేది.

1996 సెప్టెంబరు 3వ తేదీన పుడా పేరును ‘సుడా’(శ్రీసత్యసాయి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)గా మార్పు చేశారు.

తర్వాత 2007 ఫిబ్రవరి 28న ‘సుడా’పేరు తొలగించి మళ్లీ ‘పుడా’గా మార్చారు.

2022 మే 13వ తేదీన ఆరు మండలాలకు ‘పుడా’ను విస్తరించారు. పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం (అమడగూరులోని ఐదు రెవెన్యూ గ్రామాలు మినహా) పుడా పరిధిలోకి తీసుకొచ్చారు. ఫలితంగా 1,407.87 చదరపు కిలోమీటర్లు విస్తరించింది.

తర్వాత 2022 నవంబరు 7వ తేదీన అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లి, దడెంవారిపల్లి, కరిమిరెడ్డిపల్లి, రామానంతపురం, ఎస్‌.కురువపల్లె రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ‘పుడా’పరిధిలోకి మరో 9.258 చదరపు కిలోమీటర్లు చేరడంతో ప్రస్తుతం ‘పుడా’పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది.

అది నాదే కాదు.. నాది..

6

82

నేతలను ఊరిస్తోన్న ‘పుడా’ చైర్మన్‌ పదవి

జాప్యంపై ఆశావహుల అసంతృప్తి

ప్రొటోకాల్‌ కోసం మాజీ మంత్రి ఆసక్తి

అధిష్టానం వద్ద నేటికీ తేలని

పంచాయితీ

వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు చైర్మన్‌ గిరి

కూటమి సర్కారులో ఎవరినివరిస్తుందో తెలియని స్థితి

86.54

1417.33

‘పుడా’ పైనే గురి ఎందుకంటే...

పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో రెండు అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టాలన్నా...ఏడు సెంట్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలన్నా తప్పనిసరిగా ‘పుడా’ అనుమతులు తీసుకోవాలి.

పుట్టపర్తి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలోనూ ‘పుడా’ కీలక పాత్రపోషిస్తుంది. అందువల్లే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ‘పుడా’ చైర్మన్‌కు తగిన ప్రాధాన్యం ఉంటుంది.

ఇక గత టీడీపీ హయాంలో ‘పుడా’ను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు సాగించిన దందా అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు మళ్లీ ‘పుడా’ పీఠం కోసం చాలా మంది తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. వీరి బాటలోనే మాజీ మంత్రి కూడా ఉన్నట్లు తెలిసింది.

చ.కిలోమీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement