హంద్రీ–నీవా నీటితో హిందూపురం నియోజకవర్గంలోని 39 చెరువులనూ పూర్తిగా నింపాల్సిందే. అరకొర నీళ్లిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే ఊరుకోబోం. 10 రోజల నుంచి నీళ్లొస్తున్నాయని చెబుతున్నారు. మరి ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నింపారో ఎమ్మెల్యే బాలకృష్ణ, అధికారులు సమాదానం చెప్పాలి. ఎమ్మెల్యేకు నియోజకవర్గ రైతులపై ప్రేమ ఉంటే ఈపాటికి అన్ని చెరువులకూ నీళ్లందేలా చూసేవారు. చెరువులకు పూర్తిస్థాయిలో నీరు ఎప్పుడు వదులుతారో అధికారులు స్పష్టత ఇవ్వాలి.
– టీఎన్ దీపిక, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం