పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో నైపుణ్యత మెరుగు పరుచుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని హోం గార్డులకు రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్‌చార్జ్ కమాండెంట్ మహేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేసి, మాట్లాడారు. హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం పోలీస్ దర్బార్ ఏర్పాటు చేసి హోం గార్డుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్‌ఐలు మహేష్, వలి, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, ప్రదీప్‌సింగ్ పాల్గొన్నారు.