శ్రీవారి హుండీల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి హుండీల లెక్కింపు

Mar 8 2025 2:06 AM | Updated on Mar 8 2025 2:03 AM

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం ఆలయ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులు లెక్కించారు. 47 రోజులకు గాను రూ.62,73,741 నగదు, 20 గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి, 55 అమెరిక డాలర్లు సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువగా వచ్చిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షాణాధికారి ఎన్‌.ప్రసాద్‌, కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ అనంతబాబు, బ్యాంక్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సీసీ కెమెరాల

ఏర్పాటుపై శిక్షణ

పుట్టపర్తి: ఆసక్తి ఉన్న యువతకు సీసీ కెమెరా (సీసీ టీవీ)ల ఏర్పాటుపై బుక్కపట్నంలోని శ్రీసత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ పాస్‌ లేదా ఫైయిల్‌ అయిన వారితో పాటు ఆపై చదువులు అభ్యసించిన వారూ అర్హులు. ఆధార్‌ లింక్‌ ఉన్న మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ కలిగి ఉండాలి. మూడు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు పూర్తి వివరాల కోసం స్కిల్‌ హబ్‌ కో–ఆర్డినేటర్‌ (79815 41994)ను సంప్రదించవచ్చు.

ఫారం పాండ్‌

పనుల పరిశీలన

అగళి: మండలంలోని అగళి, పి.బ్యాడగెర, హెచ్‌,డి.హళ్లి గ్రామాల్లో ఉపాధి హమీ పథకం కింద చేపట్టిన ఫారం పాండ్‌ పనులను శుక్రవారం ఇన్‌చార్జ్‌ ఏపీడీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. మండలంలో మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు గాను 239 ఫారం పాండ్‌ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఫారం పాండ్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు నీటి నిల్వ ఉంటూ అవసరమైన సమయంలో పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. కంపోస్టు ఫిట్‌ల నిర్మాణం కూడా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. రోజుకు సగటున రూ.300 వేతనం పడేలా కూలీలకు పనులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ శివన్న, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీవారి హుండీల లెక్కింపు1
1/1

శ్రీవారి హుండీల లెక్కింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement