క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి

Mar 8 2025 2:05 AM | Updated on Mar 8 2025 2:01 AM

ప్రశాంతి నిలయం: క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందువల్ల ఆర్డీఓలంతా ఆయా ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్ట్‌ చాంబర్‌లో రెవెన్యూ డివిజనల్‌ అధికారులతో నియోజకవర్గాల విజన్‌ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయా నియోజకవర్గానికి సంబంధించిన విజన్‌ ప్రణాళికలో రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇందుకు ప్రతికూల, సానుకూల అంశాలను ప్రస్తావిస్తూ సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు. ఆయా నియోజకవర్గ పరిశ్రమలు స్థాపించేందుకు స్థల సేకరణ వేగవంతం చేయాలని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే జిల్లాలో గిరిజన కాలనీలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా పనులు చేపట్టాలని ఇందుకు మండలాలు, గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలన్నారు. అనంతరం జిల్లాలో సోలార్‌, వ్యవసాయ, అనుబంధ రంగాలకు, పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితి, పర్యాటక సర్కూట్‌ ఏర్పాటుకు సంబంధించిన పీపీటీని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు మహేష్‌, శర్మ, ఆనంద్‌కుమార్‌, మడకశిర నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఈఓ కృష్ణప్ప, సీపీఓ విజయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ‘షీ బాక్స్‌’ ఏర్పాటుకు చర్యలు..

జిల్లాలోని మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ తెలిపారు. శుక్రవారం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో పలువురు మహిళా ఉద్యోగులు కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టరేట్‌లో ‘షీ బాక్స్‌’ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌.. కలెక్టరేట్‌లోని ఏఓ కార్యాలయం వద్ద ‘షీ బాక్స్‌’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జేఏసీ జిల్లా చైర్మన్‌ మైనుద్దీన్‌ మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పేపర్‌పై రాసి ‘షీ బాక్స్‌’లో వేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ‘షీ బాక్స్‌’ను కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ మహిళా విభాగం జిల్లా చైర్‌పర్సన్‌ విజయభారతి, జనరల్‌ సెక్రెటరీ మధునాయక్‌, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షులు గీతాంజలి, సెక్రెటరీ సుభాషిణి, డివిజనల్‌ సెక్రెటరీ రమాదేవి, ప్రభావతి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓలతో కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి 1
1/1

క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement