ధర్మవరం రూరల్: ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే ఎరువులను, పురుగు మందులను విక్రయించాలని ఎరువుల దుకాణదారులకు జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు సూచించారు. గురువారం ధర్మవరం వ్యవసాయ సబ్ డివిజన్‌లోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లతో స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వైవీ సుబ్బారావు మాట్లాడుతూ నిర్ధేశించిన ధరలకే ఎరువులను విక్రయించి రైతులకు తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలన్నారు. స్టాక్ బోర్డు, ధరల పట్టికలు ప్రదర్శించాలన్నారు. అలాగే రైతులకు అవసరమైన మేరకు మాత్రమే పురుగు మందులను విక్రయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సనావుల్లా, సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య, ఏఓలు ముస్తఫా, ఉదయ్‌కుమార్, ఓబిరెడ్డి, రమాదేవి, కృష్ణకుమారి, కవిత, ఆత్మ బీటిఎం ప్రతిభా, సబ్ డివిజన్‌లోని పురుగుమందుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.