బెణికల్లులో ‘బెల్టు’ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

బెణికల్లులో ‘బెల్టు’ చిచ్చు

Mar 7 2025 12:44 AM | Updated on Mar 7 2025 12:44 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ‘బెల్టు షాపు’ చిచ్చును టీడీపీ నేతలు రాజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ‘వీధికోటి... సందుకోటి’ చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. తమ అనునూయులకు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా కూటమి నేతలు గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ‘బెల్టు షాపు’ నిర్వహణ అంశంలో స్థానిక టీడీపీ నేత తీసుకెళ్లిన ఒత్తిడి ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది.

న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితుడు

కణేకల్లు మండలం బెణికల్లులో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి తమ పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం బెల్టుషాపు పెట్టించాడు. గత పది రోజులుగా బెల్టు షాపు ద్వారా ఆశించిన మేర వ్యాపారం జరగలేదు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త ఎర్రిస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి చెందిన వన్నూరుస్వామి ఎన్‌డీపీఎల్‌ (నాన్‌ డ్యూటీఫైడ్‌ లిక్కర్‌) అమ్మడం వల్లే బెల్టు షాపులో అమ్మకాలు తగ్గాయని, వెంటనే వన్నూరు స్వామిని అరెస్ట్‌ చేయాలంటూ ఎకై ్సజ్‌ సీఐ ఉమాబాయిపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో తన సిబ్బందితో కలసి ఎకై ్సజ్‌ సీఐ ఉమాబాయి బుధవారం సాయంత్రం వన్నూరుస్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి మద్యం దొరకలేదు. ఇదే విషయాన్ని సదరు టీడీపీ నేతకు ఆమె ఫోన్‌ చేసి తెలిపారు. అయితే ఎలాగైనా వన్నూరుస్వామిపై కేసు బనాయించి గ్రామంలో బెల్టుషాపు సజావుగా జరిగేలా చూడాల్సిందేనంటూ ఆయన హుకుం జారీ చేయడంతో రాత్రికి రాత్రి వన్నూరు స్వామిని స్టేషన్‌కు తరలించి చితకబాది తాను కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ఒప్పించేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చిందో కాసేపటి తర్వాత వన్నూరుస్వామి కుటుంబసభ్యులకు ఓ అధికారి తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి గ్రామానికి చేరుకున్న వన్పూరుస్వామి కుటుంబసభ్యులు నేరుగా ఇంటికెళ్లి తప్పుడు కేసు ఎందుకు పెట్టించావంటూ నిలదీశారు. ఆ సమయంలో ఎర్రిస్వామి రెచ్చిపోవడమే కాక తన వర్గీయులతో దాడులకు తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనపై వన్నూరుస్వామి, ఆయన తండ్రి మల్లికార్జున, తల్లి లింగమ్మ, కుటుంబసభ్యులు అనిత, భూలక్ష్మి, చిన్న వండ్రయ్య దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చావుదెబ్బలు తిన్న తల్లి లింగమ్మ ఫిర్యాదను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఘటనపై వన్నూరు స్వామి మాట్లాడుతూ... తనను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు నమోదు చేశారని, అంతేకాక తన కుటుంబసభ్యులపై దాడి చేసి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయపోరాటం సాగిస్తానని పేర్కొన్నారు.

గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఏకపక్ష దాడులతో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement