
పరీక్ష రాస్తున్న విద్యార్థులు
అనంతపురం కల్చరల్: చిన్నారుల మేధస్సుకు పదును పెట్టేలా ‘సాక్షి’ మ్యాథ్స్–బీ, స్పెల్–బీ టాలెంట్ సెర్చ్ పరీక్ష ఉత్సాహంగా సాగింది. అనంతపురంలోని కోవూరు నగర్‌లో ఉన్న విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ వేదికగా ఆదివారం సాగిన ఈ పరీక్షకు ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. 1వ కేటగిరీలో 1, 2 తరగతులకు చెందిన 14 మంది విద్యార్థులు, రెండో కేటగిరీలో 3, 4వ తరగతులకు చెందిన 10 మంది, 3వ కేటగిరీలో 5, 6, 7 తరగతులకు చెందిన 15 మంది, 4వ కేటగిరీలో 8, 9, 10 తరగతులకు చెందిన 10 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయి విజేతలు త్వరలో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పరీక్షా కేంద్రాన్ని సాక్షి యాడ్స్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు, పాఠశాల హెచ్‌ఎం ఆశాసుల్తానా తదితరులు పర్యవేక్షించారు. కాగా, ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాలెంట్ సెర్చ్ పోటీలు విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా ఉన్నాయని పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
మేధస్సుకు పదును పెట్టిన పరీక్ష
ప్రయోజనకారిగా ఉందంటున్న
ఉపాధ్యాయులు

