
పోస్టర్లు విడుదల చేస్తున్న దృశ్యం
పుట్టపర్తి అర్బన్: విజయవాడ వేదికగా డిసెంబర్ 10న జరిగే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ మైనుద్దీన్, రాష్ట ప్రధాన కార్యదరి అల్లం సురేష్‌బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం పుట్టపర్తిలో పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మధునాయక్, గంగాద్రి, రమేష్, రమణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
3న జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ హ్యాండ్ బాల్ పోటీలు
బత్తలపల్లి: జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల విభాగాల్లో హ్యాండ్ బాల్ పోటీలను డిసెంబర్ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి సాకే శివశంకర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోటీలు ఉంటాయి. 2008, జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని గుంటూరులోని తెనాలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు 89781 37522, 70135 72439లో సంప్రదించవచ్చు.