
మడకశిర: ప్రకృతి సేద్యంతో సాగుచేసిన పంటల పరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సోమవారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్‌ఎఫ్) డీపీఎం లక్ష్మానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు రొళ్ల చేరుకోనున్న ఆయన... రైతులు నాగరాజు, హనుమంతు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన వివిధ పంటలను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం మడకశిర మండలంలోని నీలకంఠాపురానికి చేరుకుని రైతులు అనిత లక్ష్మి, మోహన్‌దాస్ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన పలు రకాల పంటను పరిశీలిస్తారన్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళతారని పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ
వైద్యుల కమిటీ నియామకం
● జిల్లా కమిటీలో 17 మందికి చోటు
సాక్షి, పుట్టపర్తి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ జిల్లా డాక్టర్ల విభాగం కమిటీని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కమిటీలో ధర్మవరం, హిందూపురం, పెనుకొండకు చెందిన 17 మంది డాక్టర్లకు చోటు లభించింది. వైఎస్సార్‌సీపీ డాక్టర్ల వింగ్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా టి.సూర్యనారాయణరెడ్డి (ధర్మవరం), ఉపాధ్యక్షులుగా బి.వెంకటరామిరెడ్డి (ధర్మవరం), సత్యనారాయణ (ధర్మవరం), ప్రధాన కార్యదర్శులుగా ఎం.రఘునాథబాబు (ధర్మవరం), ఎన్.దివ్య (ధర్మవరం), కిరణ్‌కుమార్ (ధర్మవరం), ఉమామహేశ్వరి (ధర్మవరం), కార్యదర్శులుగా కె.అర్జున్‌రెడ్డి (ధర్మవరం), నారప్ప చౌదరి (ధర్మవరం), సుబాన్ (ధర్మవరం), బి.రఘునాథరెడ్డి (ధర్మవరం), సంయుక్త కార్యదర్శులుగా మల్లికార్జున (ధర్మవరం), విజయ్‌కుమార్ (హిందూపురం), టి.బద్రీనాథ్ (ధర్మవరం), టి.రఘురామ్ (పెనుకొండ), పి.జగన్నాథ్ (ధర్మవరం), టి.హరికృష్ణ (ధర్మవరం)ను నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర కమిటీలో నలుగురికి చోటు
వైఎస్సార్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర కమిటీలోనూ నలుగురు జిల్లా వాసులకు చోటు దక్కింది. జోనల్ ఇన్‌చార్జ్(జోన్–8)గా డాక్టర్ డీవీ నాగేంద్రకుమార్‌రెడ్డిని నియమించారు. అలాగే రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ మధురాపురం అమర్‌నాథ్‌రెడ్డి, డాక్టర్ బొగ్గు సురేష్, డాక్టర్ యెన్నం సంధ్యను నియమించారు.
‘ఎంపీడీఓపై
తప్పుడు రాతలు సహించం’
ముదిగుబ్బ: బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీడీఓ విజయలక్ష్మిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ముదిగుబ్బ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిందనే కారణంతోనే ఆమైపె ఓ పచ్చ పత్రికలో విషం కక్కారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం కథనాలు రాస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాడిమర్రిలో విధులు నిర్వహిస్తూనే ముదిగుబ్బకు ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా విజయలక్ష్మి సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. ముదిగుబ్బ ఎంపీడీఓగా శ్రీకాంత్ చౌదరిని నియమించినప్పటికి ఆయనను రానివ్వకుండా చేస్తున్నారనేది అబద్ధమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీపైన, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపైన అసత్య కథనాలు రాస్తే తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
