పుట్టపర్తి టౌన్: పెనుకొండ సీఐ కరుణాకర్‌ను వీఆర్‌కు పంపుతూ శనివారం అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరుణాకర్ స్థానంలో అనంతపురం రేంజ్‌లో పనిచేస్తున్న పి. రాజా రమేష్‌ను పెనుకొండ సీఐగా బదిలీ చేశారు. అలాగే ఇటీవలే సీఐగా పదోన్నతి పొందిన హేమంత్‌కుమార్‌ను సీసీఎస్‌కు బదిలీ చేశారు.
సివిల్ పంచాయితీతో చర్యలు..!
సీఐ కరుణాకర్ ఇటీవల పెనుకొండ మండలం పెదకోట్ల గ్రామంలో ఓ సివిల్ పంచాయితీలో తలదూర్చడంతో బాధితులు స్పందనలో ఎస్పీ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేయించిన ఎస్పీ నివేదికను రేంజ్ డీఐజీకి పంపారు. దీంతో డీఐజీ అమ్మిరెడ్డి కరుణాకర్‌ను వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది.
ఇద్దరు ఎస్‌ఐల బదిలీ..
జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మాధవరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెనుకొండ ఎస్‌ఐ జి. రమేష్‌ను ‘కియా’ పోలీస్టేషన్‌కు, హిందూపురం ట్రాఫిక్ పోలీస్టేషన్ ఎస్‌ఐ అబ్దుల్ కలాంను హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్‌కు బదిలీ చేశారు.