
రథాన్ని లాగుతున్న భక్తులు
లేపాక్షి: మండలంలోని చోళసముద్రంలో చౌడేశ్వరిదేవి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, స్వస్తివాచన, రక్షాబంధన, కలశస్థాపన, అభిషేకములు, నవగ్రహ చౌడేశ్వరిదేవి మూలమంత్ర హోమము, రథాంగ హోమము, పూర్ణాహుతి, రథసంప్రోక్షణ తదితర పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని బ్రాహ్మణులు పల్లకీలో కూర్చుబెట్టి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం నిర్వహించారు. ఆలయం ప్రాంగణం నుంచి గ్రామ సచివాలయం సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఊరేగింపు సాగింది.

అమ్మవారిని రథం వద్దకు తీసుకు వస్తున్న అర్చకులు