వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

ఉదయగిరి రూరల్‌: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన ఆదివారం ఉదయం పట్టణ సమీపంలోని గండిపాళెం వెళ్లే మార్గంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లికి చెందిన కె.వెంకటయ్య బైక్‌పై ఉదయగిరి వెళ్తున్నారు. అదే మార్గంలో ఉదయగిరి నుంచి శకునాలపల్లికి బైక్‌పై దుగ్గయ్య, పవన్‌కుమార్‌ వెళ్తున్నారు. పట్టణ సమీపంలోని రైస్‌ మిల్లు వద్దకు వెళ్లేసరికి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో వెంకటయ్యకు తీవ్ర గాయాలు కాగా దుగ్గయ్య, పవన్‌కుమార్‌కు స్వల్ప గాయాలైంది. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

చవటపల్లి వద్ద..

మండలంలోని అప్పసముద్రం పంచాయతీ చవటపల్లి గ్రామానికి చెందిన పి.సుబ్బారెడ్డి బైక్‌పై ఉదయగిరి వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో సుబ్బారెడ్డికి గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుల పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement