నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని కొండ్లపూడి వద్ద పెన్నానదిలో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. సుమారు 40– 45 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బ్లూ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నారు. ఐదు రోజుల క్రితం మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
34.210 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 34.210 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2000, హైలెవల్ కాలువకు 100, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.
పొదలకూరు నిమ్మధరలు(కిలో)
పెద్దవి : రూ.60
సన్నవి : రూ.30
పండ్లు : రూ.15


