అంగరంగ వైభవంగా.. | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా..

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

ఆత్మకూరు పట్టణ పరిధిలో ఆదివారం సాయంత్రం హనుమాన్‌ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి రవితేజ కల్యాణ మండపం సెంటర్‌ మీదుగా పట్టణంలోకి మోటారు బైక్‌లపై కాషాయ జెండాలు చేతబట్టి యువకులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఏకలవ్య నగర్‌ యువకులు చేసిన కర్రసాము, పలు ప్రాంతాలకు చెందిన మహిళల కోలాట నృత్యం, దేవతా రూపాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో అయోధ్య బాలరాముడు, ఆంజనేయస్వామి, రాములవారి భారీ విగ్రహం వంటి పలు దేవతారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – ఆత్మకూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement