ఉదయం ఎఫ్‌ఏ.. సాయంత్రానికి బీఎల్‌ఏ | - | Sakshi
Sakshi News home page

ఉదయం ఎఫ్‌ఏ.. సాయంత్రానికి బీఎల్‌ఏ

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఇదీ తంతు

అధికారుల ఆదేశాలు బేఖాతర్‌

ఉదయగిరి: ప్రభుత్వం నుంచి వేతనాలు పొందే ఉద్యోగులెవరూ రాజకీయ పార్టీల తరపున బీఎల్‌ఏలుగా ఉండకూడదని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఉదాహరణకు వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో క్షేత్ర సహాయకుడు దమ్ము మల్లికార్జున టీడీపీ బీఎల్‌ఏగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ ఉపాధి హామీ పనులకు శనివారం ఉదయం హాజరై కూలీలకు సంబంధించిన మస్తర్లు, ఫొటోలు తీసుకున్నారు. సాయంత్రమయ్యేసరికి సర్‌ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీలో పాల్గొన్నారు. నిబంధనలు పాటించని క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement