ప్రతి బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.50 వరకు అదనపు వసూలు | - | Sakshi
Sakshi News home page

ప్రతి బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.50 వరకు అదనపు వసూలు

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

జిల్లాలో మద్యం సిండికేట్‌ బరితెగించింది. ‘పచ్చ’ ముఠాలు మాఫియాలుగా ఏర్పడి మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వీరికి ఎకై ్సజ్‌ శాఖ ముడుపుల మత్తులో సహకరిస్తుండడంతో మద్యం మాఫియా చెలరేగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలు కాగితాలకే పరిమితమవుతుండగా, క్షేత్రస్థాయిలో లైసెన్స్‌ దుకాణాల నుంచి విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాల వరకు ప్రతి క్వార్టర్‌ బాటిల్‌పై బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం బెల్టు షాపులే లేవంటూ ఎకై ్సజ్‌ అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు చెబుతున్నారు. వాస్తవానికి ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా ఉన్నాయనేది ‘పచ్చ’ నిజం.

Advertisement
 
Advertisement
Advertisement