మినీబార్లను తలపిస్తున్న లైసెన్స్‌ దుకాణాలు | - | Sakshi
Sakshi News home page

మినీబార్లను తలపిస్తున్న లైసెన్స్‌ దుకాణాలు

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా సర్కారు ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత సమయంలో మాత్రమే విక్రయాలు చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీని ప్రైవేట్‌ పరం చేసింది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయాలకు తెరలేపారు. ప్రతి దుకాణం పక్కనే అనధికారిక పర్మి ట్‌ రూమ్‌లు కొనసాగుతున్నాయి. ఇవి మినీబార్లను తలపిస్తున్నాయి. జిల్లాలో సర్వేపల్లి, గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో లైసెన్స్‌ దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోంది. వెంకటాచలం, గూడూరు, ఉదయగిరిలో ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వసూలు చేసుకుంటున్నారు. ఇటీవల మద్యం ప్రియులే షాపుల ముందు ఎమ్మార్పీ ఉల్లంఘనపై వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడం సంచలంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారుల్లో మార్పు రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement