అనుమసముద్రంపేట: మండలంలోని చిరమన గ్రామ సమీపంలో దాదాపు వంద ఎకరాల్లోని నిమ్మ, మామిడి తోటలు గురువారం సాయంత్రం దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చిరమనకు చెందిన కోడూరు శృతిరెడ్డి, నెల్లూరుకు చెందిన రామకృష్ణ 110 ఎకరాల్లో నిమ్మ, మామిడి తోటలు పెంచుతున్నారు. ఏమైందో ఏమో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఇది గమనించిన చుట్టు పక్కల వారు తోట యజమానులకు సమాచారం అందించారు. శృతిరెడ్డికి చెందిన 22 ఎకరాలు, రామకృష్ణకు చెందిన దాదాపు 80 ఎకరాలు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పబ్లిక్ హెల్త్ సీఈగా మోహన్
తిరుపతి తుడా: నెల్లూరు పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న టీ మోహన్‌కు చీఫ్ ఇంజినీర్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చీఫ్ ఇంజినీర్‌గా కొనసాగనున్నారు. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆయన సూపరిటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేశారు.


