రూ.వెయ్యి కోట్ల ఇసుక కొల్లగొట్టేశారు! | - | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్ల ఇసుక కొల్లగొట్టేశారు!

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

సంగం వద్ద పెన్నానదిలో ఇసుకను తవ్వి టిప్పర్లలో లోడ్‌ చేస్తున్న యంత్రం

ఇసుక తోడేళ్లు పెన్నానదిలో పడి లోడేస్తున్నాయి. రేయింబవళ్లు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలు పెట్టి ఇసుక దందా చేస్తున్నారు. నదిలో ఇరవై అడుగుల లోతు వరకు యంత్రాలతో తోడేస్తుండడంతో పక్కనే ఉన్న సోమశిల ప్రాజెక్ట్‌కు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల ధనదాహానికి పెన్నమ్మ గర్భం శోకిస్తూ నిత్యం

వణికిపోతుంది. జిల్లాలోని పెన్నానదిలో జరిగే ఇసుక దందాతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నెలనెలా రూ.కోట్ల ముడుపులు

ముట్టుతుండడంతో అధికార యంత్రాంగం సైతం జీ హుజార్‌ అంటూ మామూళ్లతో తమ కళ్లకు గంతలు కట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి.

నెల్లూరు బ్యారేజీ–2 : పోతిరెడ్డిపాళెం, కోవూరు

సంగం బ్యారేజీ–2 : సంగం మండలం

సూరాయపాళెం : సూరాయపాళెం

పొదలకూరు

మండలం

సంగం బ్యారేజీ : కలువాయి

మండలం రాజుపాళెం

సెమీ మెకనైజ్డ్‌ ఓపెన్‌ రీచ్‌లు

అప్పారావుపాళెం– ఆత్మకూరు

మినగల్లు – బుచ్చిరెడ్డిపాళెం

(వర్కింగ్‌లో లేదు)

విరువూరు : పొదలకూరు మండలం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల ధన దాహం.. అధికారుల అవినీతి దాహం వెరసి జిల్లాలో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా పెన్నానదిలో ఊరూరా అనధికార రీచ్‌లు పెట్టి ఇసుకను కొల్లగొడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు రెండేళ్లు నిర్వీరామంగా ఉచిత ఇసుక పేరిట ఆ పార్టీ నేతలు సాగిస్తున్న ఇసుక దోపిడీతో నదీ స్వరూపం కోల్పోగా, జిల్లాకే జలనిధి అయిన సోమశిల ప్రాజెక్ట్‌ను ప్రమాదపు అంచుకు చేరుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగాలు నెలనెలా మామూళ్లు దండుకుంటూ ముఖం చాటేస్తున్నాయి.

రెండేళ్లలో రూ.వెయ్యి కోట్ల ఇసుక హాంఫట్‌

జిల్లాలో కలువాయి మండలం తెలుగురాయపురం నుంచి ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం వరకు అధికారిక డీసిల్టింగ్‌, అనధికారిక రీచ్‌లతో కలుపుకుని సుమారు 20 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఆయా రీచ్‌ల నుంచి ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలతో కలుపుకొని వెయ్యికిపైగా వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. సగటున నిత్యం 50 వేల టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. టన్ను రూ.300 లెక్కన లోడింగ్‌తో కలుపుకొని విక్రయాలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.1.50 కోట్ల టర్నోవర్‌ జరుగుతుంటే.. నెలకు రూ.45 కోట్ల ఇసుక వ్యాపారం జరుగుతోంది. గడిచిన 23 నెలలుగా నిర్వీరామంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లకుపైగా టీడీపీ నేతలు దోచుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు బినామీలను పెట్టి చేస్తుంటే.. మరికొందరు టీడీపీ నేతలకు అప్పగించడంతో నెలనెలా మామూళ్లు దండుకుంటూ ఇసుక దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్‌జీటీ ఆదేశాలు తుస్‌

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలే చట్టాలుగా మార్చేసి యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. సాగునీరు కాలువకు వెళ్లే చోట అడ్డంగా గట్టుకట్టి మరీ గ్రావెల్‌ వేసి రహదారులు నిర్మించి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న తప్పుతో.. భవిష్యత్‌లో పెను ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిత్యం వేలాది టన్నులు ఇసుకను తోడేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదు. అటు పోలీస్‌లు ఇసుక అక్రమ దందాకు రక్షణగా ఉండగా, జిల్లా యంత్రాంగం మాత్రం సాగిల పడి అఽధికారానికి సలామ్‌ చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు.

జిల్లాలో అధికారిక డీసిల్టింగ్‌ పాయింట్లు

పెన్నానదిలో అడుగడుగునా యంత్రాలు పెట్టి ఇసుక తోడేత

కలువాయి మండలం రాజుపాళెంలో బరితెగించిన తమ్ముళ్లు

ఏకంగా నదిలోకి

పక్కా రోడ్డు నిర్మాణం

ఇరవై అడుగుల లోతు వరకు తవ్వకాలు

పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న పట్టించుకోని అధికారులు

ప్రజాప్రతినిధులకు నెలనెలా

రూ.కోట్లలో మామూళ్లు

సోమశిల ప్రాజెక్ట్‌కు పొంచి ఉన్న ముప్పు

మామూళ్ల మత్తులో

అధికారుల కళ్లకు గంతలు

Advertisement
 
Advertisement
Advertisement