వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

కోవూరు: మండలంలోని తూర్పు అరుంధతీయవాడలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బ్రహ్మ బుధవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంటి సమీపంలో బ్లేడుతో కోసుకుని రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని అనుమానిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement