త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం

చిల్లకూరు: ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీ కారును ఢీకొనడంతో కారు వ్యతిరేక దిశలోకి తిరిగి నిలిచిపోయింది. ఈ ఘటనతో వెనుక వచ్చే వాహనదారులు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం వరగాలి క్రాస్‌ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు శ్రీకాళహస్తిలో జరిగిన ఉత్తరక్రియలకు కారులో వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌–వరగాలి క్రాస్‌రోడ్డు సమీపంలో నాయుడుపేట వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా కారును అధిగమించే ప్రయత్నం చేయగా, కారును డ్రైవర్‌ రోడ్డు మార్జిన్‌ దింపేశాడు. తిరిగి ఎక్కే సమయంలో లారీ ఢీకొనడంతో లారీ ఢీకొనడంతో కారు టైర్లు పగిలిపోయి వ్యతిరేక దిశలో ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెనుక వస్తున్న వాహనాలు కి.మీ మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు గంటకుపైగా సమయం పట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement