తమ్ముళ్లకు స్పెషల్‌.. డ్రమ్ములకు డీజిల్‌ | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు స్పెషల్‌.. డ్రమ్ములకు డీజిల్‌

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

సొసైటీ బంకులో

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

సంగం: డీజిల్‌, పెట్రోల్‌ కొరత ఉన్న నేపథ్యంలో డ్రమ్ములు, క్యాన్లకు డీజిల్‌ పడితే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా తెలుగు తమ్ముళ్లకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ లభిస్తోంది. సంగం మండలంలో ఆరు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిలో సహకార సంఘం పెట్రోల్‌ బంకు కూడా ఉంది. ఐదు పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ అయిపోవడంతో ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు సంగం వ్యవసాయ పరపతి సహకార సంఘం (సొసైటీ) పెట్రోల్‌ బంకులకు పరుగులు తీశాయి. అయితే సంగానికి చెందిన దేశం నేతలు తమ ట్రాక్టర్లలో ఖాళీ డ్రమ్ములు వేసుకుని డీజిల్‌ మొత్తం నింపుకుని వెళ్లడంతో అప్పటి వరకు వేచిచూస్తున్న వాహనదారులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని ఇది సొసైటీ బంకు అని దబాయించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement