నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం కావలి ఏరియా వైద్యశాలలోని కాన్పుల విభాగానికి వచ్చాను. కొన్ని నెలలుగా ఇక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకుందామంటే అంత ఆర్థిక స్తోమత లేదు.
– జడ ప్రవళిక, సర్వాయపాళెం,
కావలి మండలం
ప్రైవేట్ ఆస్పత్రిలో
చేయించుకోవాలనుకుంటున్నా..
నాకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందామని కావలి ఏరియా వైద్యశాలకు వెళ్తే ప్రస్తుతం ఇక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని చెప్పడంతో డబ్బులు సమకూర్చుకొని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకుందామని అనుకుంటున్నాను.
– ఒంగోలు భార్గవి, జలదంకి
● కాన్పుల విభాగంలో ఇద్దరు డాక్టర్లు, ఎనిమిది మంది సిబ్బంది
● పది నెలలుగా ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయని వైనం
● సౌకర్యాలున్నా.. సేవలు శూన్యం
తాగునీటి ఎద్దడి
నివారణకు చర్యలు
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆదేశించారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో గల తన చాంబర్‌లో పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. జెడ్పీ నిధులతో మంజూరు చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రారంభం కాని వాటిని రద్దు చేసి, ఆ స్థానంలో కొత్త పనుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కోరారు. వర్కుల్లో నాణ్యత లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీఈఓ శ్రీధర్‌రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డీసీపల్లిలో 414 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 414 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 477 బేళ్లు రాగా, వీటిలో 414ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 57,699.7 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,41,19,350.30 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.220.. సగటు ధర రూ.244.70గా నమోదైందని వెల్లడించారు. ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
కావలి ఏరియా వైద్యశాలలోని కాన్పుల విభాగం ‘కుని’కి పాట్లు పడుతోంది. పేదింటి మహిళలకు కాన్పులు, కుటుంబ నియంత్రణ వైద్య సేవలు అందించేందుకు మెరుగైన సౌకర్యాలు, తగినంత వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ సేవలు శూన్యంగా మారాయి. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు, చుట్టు పక్కల మండలాల్లోని పీహెచ్‌సీలకు నిత్యం పదుల సంఖ్యలో గర్భిణులు వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే ప్రధానంగా వీరందరికి కాన్పులు, కుటుంబ నియంత్రణచేపట్టాలంటే ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఏరియా వైద్యశాలకు తీసుకువస్తుంటారు. అయితే ఇక్కడి కు.ని. ఆపరేషన్లు చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
●
కావలి: జిల్లా కేంద్రం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాలలో ఉన్న కాన్పుల విభాగం నిరుపయోగంగా మారింది. కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన అత్యాధునిక వసతులతోపాటు కూడా ఆపరేషన్ థియేటర్, అవసరమైన ఇద్దరు డాక్టర్లు, ఒక ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నిషియన్, జూనియర్ అసిస్టెంట్, ఎఫ్‌ఎన్‌ఓ, మరో ఉద్యోగి ఉన్నారు. అయితే 10 నెలలుగా ఈ కాన్పుల విభాగంలో ఒక్కటంటే ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన పాపాన పోలేదు. వీరికి నెలలకు రూ.లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నప్పటికీ.. ఒక ఆపరేషన్ కూడా జరగకపోవడంతో ప్రజాధనం ఏ విధంగా దుబారా అవుతుందో అర్థమవుతోంది.
జీజీహెచ్‌కు రెఫర్..
కావలి పట్టణంలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు కావలి మండలం తుమ్మలపెంట, సర్వాయపాళెం, బోగోలు మండలంలోని కోవూరుపల్లి, జలదంకి, కొండాపురం, గట్టుపల్లి ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చే ప్రతి ఒక్కరినీ నేరుగా నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి రిఫరల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలే పేదరికం.. ఊరుకాని ఊరికెళ్లి అక్కడ మూడు రోజుల పాటు ఉండాల్సి రావడంతో ఖర్చులు పెరిగి పోతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆపరేషన్ చేయించుకొనే మహిళలను ఆశా, ఏఎన్‌ఎం నెల్లూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లాలంటే ఆటో ఖర్చులకు చేతి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఆశా, ఏఎన్‌ఎంలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలనే టార్గెట్లు పెట్టడం, ప్రభుత్వం సైతం ఖర్చులకు నిధులివ్వకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో వారు వ్యయప్రయాసలు పడుతున్నారు. కొద్దో గొప్పో ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లు స్థానికంగానే ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించి వేల రూపాయిలు వెచ్చించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు, ముఖ్యంగా గిరిజనులు కు.ని. ఆపరేషన్‌కు దూరమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి గర్భం దాల్చుతున్న పరిస్థితి నెలకొంది. మరి కొందరు అయితే ఇక్కడే కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ సుజాతను సంప్రదించగా, కావలిలోని కాన్పుల విభాగంలోని డాక్టర్లు ఇద్దరు ఉన్నారని, వారికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేకపోవడంతో ప్రస్తుతం వారు శిక్షణ పొందుతున్నారని, వీలైనంత త్వరలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మొదలు పెడుతామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కావలి ఏరియా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేటట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు.


