నెల్లూరు(వీఆర్సీసెంటర్): భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ఎంతో అవసరమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత్ భవన్‌లో ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విలువలను కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించినప్పుడే అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించిన వారవుతామని తెలిపారు. వేసవిలో రోజూ అత్యధికంగా 14,586 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ మాట్లాడారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి డిస్కమ్ అభివృద్ధి పథంలో పయనించేలా ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య, జేసీ వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్ పవన్‌కుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్‌నాయడు, జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నేతలు కిరణ్, శివశంకర్, రమేష్‌బాబు, జయరామయ్య, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.


