పొదలకూరు : పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో సోమవారానికి పొదలకూరులోని కొన్ని బంకులు మూతపడగా, నిల్వలు ఉన్న కొన్ని బంకుల ముందు బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. దీంతో బైకులకు పెట్రోల్ రూ.100, ఆటోలకు డీజిల్ రూ.200, కారుకు రూ.500 అంతకు మించి పట్టడం లేదు. ముత్తుకూరు మండలంలో డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 90 శాతం పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అరకొర బంకుల్లో కొద్దిపాటి ఇంధనం అందుబాటులో ఉండగా అక్కడ వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రో ల్ ఉంటే డీజిల్ లేదని, డీజిల్ ఉంటే పెట్రోల్ అందుబాటులో లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


