● రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
దుత్తలూరు: బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని సోమలరేగడ సమీపంలో 167 బీజీ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పీట్ల నవీన్ (22) వరికోత మెషీన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయగిరి మండలంలోని ఓ గ్రామంలో పనికి వెళ్లాడు. తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. సోమలరేగడ సమీపంలో బైక్ అదుపు తప్పింది. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది నవీన్‌ను చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్తుండగా మృతిచెందాడు. నవీన్‌కు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


