● బీసీ సంక్షేమ సంఘం
జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య
నెల్లూరు(వేదాయపాళెం): బీసీలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. నెల్లూరులోని యాదవ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలు ఐక్యంగా పోరాడితేనే అన్ని రంగాల్లోసముచిత స్థానం సాధించగలమన్నారు. పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. రాజ్యాంగాన్ని సవరించి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి. పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా అమలు చేయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో ఎంపీ బీద మస్తాన్‌రావు, నేతలు వై.నాగేశ్వరరావు, శ్రీనివాసులు యాదవ్, నడవడి ముత్యంగౌడ్, బొమ్మి నాగకిషోర్, శ్రీనివాసయాదవ్, వెంకటజ్యోతి, వెంకటసుబ్బయ్య, కిషోర్ యాదవ్, డీఏ లక్ష్మీయాదవ్, ఇందిర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


