● గుర్తించిన గూడూరు ఆర్డీఓ
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని పలు చికెన్ దుకాణాలతోపాటుగా బైపాస్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆదివారం ఆర్డీఓ సత్యనారాయణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సంఘం థియేటర్ ప్రాంతంలోని ఓ దుకాణంలో ఫ్రీజర్‌లో చికెన్‌ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే బైపాస్ ప్రాంతంలోని ఓ హోటల్లో తనిఖీలు చేయగా అక్కడ కూడా ఫ్రీజర్‌లో నిల్వ చేసిన చికెన్‌తో కస్టమర్లకు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం చికెన్‌పై ఫినాయిల్ పోసి బయట పార వేయించారు. ఆర్డీఓ మాట్లాడుతూ వారానికి ఒకసారి హోటళ్లు, చికెన్ షాపులను తనిఖీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


