డీజిల్‌ అయిపోయి నిలిచిన లారీ | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ అయిపోయి నిలిచిన లారీ

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

హైవేపై రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్‌

దగదర్తి: కావలి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ లారీ శనివారం అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్దకు రాగానే డీజిల్‌ అయిపోయి నిలిచిపోయింది. దాని వెనుకే వడ్లపొట్టుతో వెళ్తున్న ట్రాక్టర్‌ నిలిచిపోయింది. దీంతో వంతెనపై ఒకవైపు వెళ్లే రహదారి కావడంతో నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై భారీగా నిలిచి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. డ్రైవర్‌ డీజిల్‌ కోసం దగ్గరలోని ఉలవపాళ్ల ఐఓసీ పెట్రోల్‌ బంక్‌కు వెళ్లగా అక్కడ డీజిల్‌ లేకపోవడంతో వంతెనపై లారీ అలాగే నిలిచిపోయి సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు రెండు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైవే మొబైల్‌ సిబ్బంది, దగదర్తి పోలీసులు క్రేన్‌ సహాయంతో లారీని రహదారిపై పక్కకు తొలగించి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ లేకపోవడంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement