నెల్లూరు రూరల్: కోవూరులోని సాయిబాబా మందిరంలో భక్తుల సమక్షంలో టీడీపీ లోని వర్గాలు దాడులకు పాల్పడటం హేయమని, దీన్ని అడ్డుకోవాల్సిన ఎమ్మె ల్యే ప్రశాంతిరెడ్డి అక్కడే ఉండి చోద్యం చూడటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేర కు నగరంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో విలేకరులతో కోవూరు నియోజకవర్గ నేతలు శనివారం మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ఎక్కడ బయటపడి వైరలవుతాయనే ఉద్దేశంతో భక్తులను చెదరగొట్టారని, ఆపై సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్వాహకులు వెళ్తే, ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలకు సుపరిపాలనను అందించేందుకేనని, అయితే అందుకు విరుద్ధంగా.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికే పరిమితమవడం మినహా నియోజకవర్గానికి ఆమె చేసిందేమీలేదని విమర్శించారు.
అక్రమాలకు వత్తాసు పలుకుతూ..
కోవూరు పంచాయతీ కార్యదర్శి అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుంటే ఎమ్మెల్యే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని తెలిపారు. పంచాయతీలో నీళ్లు రావడంలేదని కార్యదర్శిని ప్రశ్నిస్తే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పనిచేసిన ప్రతి కార్యాలయంలో రికార్డులను మాయం చేయడంలో సదరు వ్యక్తి దిట్ట అని విమర్శించారు. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వందల కోట్లను వెచ్చించి సచివాలయాలను నిర్మించారని, అయితే ఇందులో ప్రస్తుతం పది శాతాన్నైనా అభివృద్ధికి ఖర్చు చేశారానని ప్రశ్నించారు. కోవూరులో రౌడీయిజం, గూండాయిజం, మాదకద్రవ్యాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము నిరంతరం పోరాటా లు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్దుకోకపోతే ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. పా ర్టీ మండల కన్వీనర్లు అనూప్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, శేషగిరిరావు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, మాజీ సర్పంచ్ ఉమా, జనార్దన్, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


