మలేరియాను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

మలేరియాను నిర్మూలిద్దాం

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

నెల్లూరు(అర్బన్‌): మలేరియాను పూర్తి స్థాయిలో నిర్మూలిద్దామని డీఎంహెచ్‌ఓ సుజాత, మలేరియా నివారణాధికారి డాక్టర్‌ అంశుధర్‌ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీని శనివారం నిర్వహించారు. అనంతరం జరిపిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. వైద్యశాఖ చేపట్టిన చర్యల ఫలితంగా మలేరియా కేసులు దాదాపు కనుమరుగయ్యాయని వివరించారు. ఇల్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, ఎన్సీడీ అధికారి యశ్వంత్‌, ఎపిడమిక్‌ జిల్లా అధికారి భాస్కర్‌, అసిస్టెంట్‌ మలేరియాధికారి జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement