నెల్లూరు(అర్బన్): సామ్రాజ్యవాదం, యుద్ధాలతో సామాన్య ప్రజలు తీవ్ర భారం మోయాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు అన్నారు. శుక్రవారం నెల్లూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో అమెరికా సామ్రాజ్యవాదం, యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలు అనే సదస్సులో ఆయన మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధ ఫలితంగా ముడిచమురు ధరలు పెరిగాయన్నారు. ఇండియాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిందన్నారు. బ్లాక్‌లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అమ్ముతున్నారన్నారు. నిత్యావసర ధరలు పెంచేశారన్నారు. కార్యక్రమంలో ఏపీ హంస నాయకులు గౌస్‌బాషా, మంజరి, లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు.


