సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా టీడీపీలో నాబార్డు నిప్పు రాజుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తాజాగా బహిరంగ దాడిగా మారింది. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు అధికారిక సమావేశంలో అసంతృప్తి మాటలు తూటాలై పేలాయి. మంత్రి నారాయణ ఒంటెద్దు పోకడలపై ఆయన పరోక్షంగా జరిగిన ఐఏబీ వేదికగా తాడోపేడో తేల్చుకుందామనే వరకు వెళ్లాయి. గురువారం జిల్లాలో రెండో పంటకు సంబంధించి ఐఏబీ సమావేశంలో కాలువల అభివృద్ధిపై జరిగిన చర్చలో నాబార్డు నిధులపైకి మళ్లింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే.. కేవలం రూ.50 కోట్లు నెల్లూరు నగరానికి మాత్రమే కేటాయించుకుని, మిగతా ప్రతిపాదనలు పక్కన పెట్టించడంలో మంత్రి నారాయణ చక్రం తిప్పారంటూ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తడంతో అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురి చేసింది. అయితే ఈ నిధులను తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే డ్రెయినేజీ కాలువల పనులకే కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నారాయణ తీరుపై ఆనం రుసరుసలు
నాబార్డు నిధులు మంజూరు, కేటాయింపుల్లో మంత్రి నారాయణ తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అందుకు మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం రుసరుసలాడారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యేలకు వంతపాడడంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తొలుత ఈ అంశాన్ని లెవనెత్తడంతో మిగతా ఎమ్మెల్యేలు గళం కలిపారు. నాబార్డు నిధులకు సంబంధించి మన ప్రతిపాదనలు ఏమయ్యాయంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ విషయంలో అధికారులను నిలదీయడంతో ఏమీ చెప్పలేక నీళ్లు నమిలారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చడంతో ఆయా ఎమ్మెల్యేలు మంత్రి నారాయణ తీరును ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గాలను కాదని నారాయణకు ఉన్న పరపతితో సిటీ నియోజకవర్గానికే కేటాయింపులు వచ్చేలా చేయడం, ఆ నిధులు సైతం తమ్ముళ్లు పంపకం చేసేందుకేననే ఆరోపణలున్నాయి. బహిరంగంగానే మంత్రి నారాయణపై ఆరోపణలు చేయడం ఆ పార్టీలోనే ఆధిపత్య పోరుపై మరోసారి ఉన్నట్లుగా తేటతెల్లమైంది. ఇటీవల నెల్లూరు సిటీలో నారాయణ మొక్కలతో సుందరీకరణ పేరుతో మొక్కల పెంపకానికి దాదాపు రూ.60 కోట్లు అవినీతి చేశాడంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఆధారాలతో సహా బయట పెట్టినా.. అందుకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా ఏ టీడీపీ నేత కూడా ముందుకు రాలేదంటూ మంత్రి నారాయణ తీరునే ఆక్షేపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తడం ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది.
అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఏమీలేదు
నిధుల కోసం పోరాటం తప్పడంలేదంటూ గత ప్రభుత్వంలో కింద కూర్చొని మాట్లాడే వాడని, ఇప్పుడు పైన కూర్చొని మాట్లాడుతున్నాను.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీలేదంటూ మంత్రి ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. మంత్రి ఆనం బేల మాటలు, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రభుత్వంలో తన ప్రాభవం లేదని చెప్పకనే చెప్పినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐఏబీ వేదికగా పేలిన అసంతృప్తి
జిల్లా వ్యాప్తంగా రూ.200 కోట్లకు ప్రతిపాదనలు
నగరానికే నిధులు..
నియోజకవర్గాలకు రిక్తహస్తాలు
మా పరిస్థితేమిటంటూ గళమెత్తిన ఎమ్మెల్యేలు
తాడోపేడో తేల్చుకుందామన్న మంత్రి ఆనం
సాగునీటి సలహా మండలి సమావేశం
మిగిలిన నియోజకవర్గాలకు రిక్తహస్తమా..?
తమకే దిక్కులేదంటూ అసంతృప్తులు
ఐఏబీ సమావేశం వేదికగా పలువురు ఎమ్మెల్యేలు తమ ఆదేశాలకే దిక్కులేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం గిట్టుబాట ధర విషయంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళితే సరిగా స్పందించలేదన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ లష్కర్లు లేని కారణంగా చివరి భూముల వరకు నీరు అందడమలేదన్నారు. ఉన్న లష్కర్లకు వేతనాలు చెల్లించడంలేదన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ టీపీగూడూరు మండలంలో రెండో పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు.
మాకే దిక్కులేకుండాపోయింది..
తాడోపేడో తేల్చుకుందాం


