మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. దళారులు కుమ్మకై ్క రైతులను దోచుకుంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పంట కొనుగోలుకు పరిమితులు విధించకుండా తేమ శాతం నిబంధనలను సడలించి నాణ్యత పేరుతో నిబంధనలు విధించకుండా పూర్తి పంటను కొనుగోలు చేయాలి.
– చిన్నా, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తక్షణమే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలకు తరలించే స్తోమత లేక డబ్బులు అత్యవసరమై దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకుని నష్టపోవాలసిన పరిస్థితి పొంచి ఉంది. పంట చేతికి వచ్చి మూడు వారాలు అవుతున్నా ఇంకా ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.
– రత్తయ్య, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి
ఎకరాకు
రూ.20 వేల వరకు నష్టం
ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.1,500 నుంచి రూ.1,600 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర కంటే చాలా తక్కువ. ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. దళారులు తక్కువ ధరకే కొంటుండడంతో ఎకరాకు 20 వేల వరకు నష్టం వాటిల్లుతోంది.
– పుల్లయ్య, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి


