సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

ఎస్పీ అజిత

ఉదయగిరి: ‘ఉదయగిరి లాంటి మారుమాల ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా వచ్చా. వాటి పరిష్కారానికి కృషి చేస్తా’ అని ఎస్పీ వేజండ్ల అజిత తెలిపారు. ఉదయగిరి పోలీస్టేషన్‌లో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి అర్జీలు సేకరించారు. ఎస్పీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. భూ వివాదాలపై దృష్టి పెట్టి గొడవల్లేకుండా చూస్తామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసులపై శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌కు 18 అర్జీలు వచ్చాయి. వీటిలో చోరీలు, సైబర్‌ నేరాలు, ఉద్యోగాల పేరుతో నగదు వసూలు, భూ వివాదాలు తదితర వాటిపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కావలి డీఎస్పీ రమణరావు, ఎస్‌బీ డీఎస్పీ వినీల్‌, కలిగిరి, ఉదయగిరి సీఐలు సుబ్బారావు, వెంకట్రావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement