నెల్లూరు(టౌన్): శాప్‌లీగ్ – 2026లో భాగంగా జిల్లా క్రీడాప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని ఏసీ స్టేడియంలో జిల్లా స్థాయి బాక్సింగ్, ఫుట్‌బాల్ పోటీలు జరిగాయి. వీటిని డీఎస్‌డీఓ జసీమ్ ప్రారంభించారు. ఫుట్‌బాల్ పోటీల్లో 170 మంది, బాక్సింగ్ పోటీల్లో 35 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ మాట్లాడుతూ ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలో జరిగే ఫుట్‌బాల్, అలాగే విశాఖలో జరిగే బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ డాక్టర్ దేవిక, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


