మహిళా భద్రతపై అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

మహిళా భద్రతపై అవగాహన సదస్సు

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

ఉదయగిరి: మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు గానూ కఠిన చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మహిళా భద్రతపై స్థానిక పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తమ హక్కుల కోసం మహిళలు పో రాడాలని, అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు సంస్కారంతో కూడిన అలవాట్లను నేర్పాలని కోరారు. ఆత్మకూరు ఆర్టీఓ పావని, సీఐ వెంకట్రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో చదివితే

ఉత్తమ ఫలితాలు

వెంకటాచలం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలను సాధించొచ్చని ఆర్‌ఐఓ వరప్రసాదరావు పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వెంకటాచలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు బహుమతులను గురువారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేందుకు శ్రమించాలని సూచించారు. పోటీతత్వం ఉంటేనే మెరుగైన ఫలితాలను సాధించొచ్చన్నారు. అర్థమయ్యే రీతిలో బోధించాలని అధ్యాపకులను కోరారు.

డీసీపల్లిలో 236 పొగాకు

బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 236 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. 299 బేళ్లు రాగా, వీటిలో 236ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 33,012 కిలోల పొగాకును విక్రయించగా, రూ.80,60,464 వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.230.. సగటు ధర రూ.244.17గా నమోదైందని వివరించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement