విద్యాసంస్థలకు నేటి నుంచి సెలవులు | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థలకు నేటి నుంచి సెలవులు

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

నెల్లూరు(టౌన్‌): జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులను శుక్రవారం నుంచి ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్‌ కళాశాలలను జూన్‌ ఒకటిన.. ప్రభుత్వ పాఠశాలలను జూన్‌ 12న పునఃప్రారంభించనున్నారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆర్‌ఐఓ వరప్రసాదరావు, డీఈఓ బాలాజీరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 65,353 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,550 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.43 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement