నెల్లూరు (లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్ నిర్వహణకు అనుభవం గల వ్యక్తుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కార్యాలయానికి టెండర్ దరఖాస్తులను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు పంపాలని కోరారు.
కండలేరులో
44.31 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 44.310 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.


