రాపూరు: పెంచలకోన క్షేత్రంలో బుధవారం రామానుజ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి, రామానుజ విగ్రహానికి పాలు, చందనం, నెయ్యి, తేనె, వివిధ రకాల పళ్లరసాలతో స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిలో కొలువుదీర్చారు. రామానుజ ఉత్సవ విగ్రహన్ని మరో తిరుచ్చిలో కొలువుదీర్చి స్వామి, అమ్మవారికి అభిముఖంగా ఉంచి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.


