స్పందించండి మహాప్రభో.. | - | Sakshi
Sakshi News home page

స్పందించండి మహాప్రభో..

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

వినతులు సమర్పించిన జనం

నెల్లూరురూరల్‌: ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా అర్జీలను పరిశీలించండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌, తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి, స్పెషల్‌ అధికారి వంశీకృష్ణ, డీపీఓ వసుమతి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నాగశేఖర్‌ అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

● ఆమంచర్ల పంచాయతీ మట్టంపాడు గ్రామంలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలివ్వాలని సీపీఎం నెల్లూరు రూరల్‌ మండల కమిటీ నేతలు జేసీ మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు.

● దివ్యాంగులకు రైల్వే పాసులు కావాలంటే నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని డాక్టర్‌ అప్లికేషన్‌పై సంతకం చేయాలని, ఒకరే ఉండటంతో ఇబ్బందిగా ఉందని వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ సనావుల్లా వినతిపత్రం అందజేశారు. ఐదుగురు డాక్టర్లను ఏర్పాటు చేసి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

● రైతులకు ప్రభుత్వ బీమాను అమలు చేయాలని భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ కోరారు. కలెక్టరేట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నేతలు డాక్టర్‌ గుంజి నరసింహారావు, సోమ గోపాల్‌, గారా వెంకటరమణయ్య, సెల్వం, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement