వెహికల్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేట్ సంస్థ అయిన ప్రణీత్ టెస్టింగ్ సెంటర్‌కి అప్పగించారని, లంచాలు ఇస్తే వెంటనే పని అవుతుందని నెల్లూరుకు చెందిన లారీ ఓనర్ బొద్దుకూరు నాగరాజు వినతిపత్రం ఇచ్చారు. హెవీ వెహికల్స్‌కి రూ.9,000, ఎల్‌ఎన్‌వీకి రూ.4,000 లంచం ఇస్తే ఏజెంట్లు ఎఫ్‌సీ తెచ్చిస్తున్నారని ఆరోపించారు. యార్డులో ఉన్న లారీకి రూ.50 వేలు లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ఆర్టీఏ అధికారులకు తెలిపితే మాకు ఏమీ సంబంధం లేదని బదులిచ్చారన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


