మంత్రి ఆనం అధికార దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఆనం అధికార దుర్వినియోగం

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

తిరుమల

గాలిగోపురం తరహాలో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌

ఆత్మకూరు: దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలతో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పాతాళానికి దిగజారిపోయారు. తిరుమల గాలిగోపురం తరహాలో ఆత్మకూరులో సెట్టింగ్‌ వేసి, ఏకంగా తిరుమల అర్చకులతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జొన్నవాడ, పెంచలకోన, రాజరాజేశ్వరి ఆలయాల అర్చకులను రప్పించి ఆయుష్షు హోమాన్ని నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మలికార్జునస్వామి లడ్డూ ప్రసాదాలను తెప్పించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మొదలుకొని ఈఓలు, ఇన్‌స్పెక్టర్లు, ఫారెస్ట్‌, విద్యుత్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారుల హాజరై సేవలందించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement