జేఈఈ మెయిన్స్‌ ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల విడుదల

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

నెల్లూరు (టౌన్‌): ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి గానూ నిర్వహించిన రెండో విడత జేఈఈ మెయిన్స్‌ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ స్థాయిలో జనరల్‌ కేటగిరీలో అక్షయ విశిష్ట 561, వేనాటి కుశాల్‌రెడ్డి 954, పొదిలి రామ్‌చరణ్‌ 1602, యశ్వంత్‌రెడ్డి 1872 ర్యాంకులను సాధించారు.

కామాక్షితాయికి

వెండి పట్టీల బహూకరణ

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో వెలసిన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారికి 234 గ్రాముల వెండి పట్టీలను ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన దంపూరి కుష్వంత్‌కుమార్‌ దంపతులు సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా దాత గోత్రనామాలతో పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ తిరుమూరు అశోక్‌రెడ్డి, ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement